11, జూన్ 2010, శుక్రవారం

రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ గారి పాకుడు రాళ్ళు

నేను ఈ నవలను 1991 లో మొదటి సారి చదివాను. ఆ తర్వత కనీసం మరో పదిమార్లు చదివాను. ఎన్నిసార్లు చదివినా, చదివిన ప్రతి సారి కొత్తగా అన్పిస్తుంది.
ఈ నవల కృష్ణా పత్రికలో వచ్చిందట. ఆ తరువాత 1990 లో వేయి కాఫిలతో ప్రధమంగా ముద్రింపబడింది.
తొలి ముద్రణకు ఆలపాటి వెంకట్రామయ్య గారు పీఠిక అద్భుతంగా వ్రాశారు.
వారి మాటలలో
" పాకుడు రాళ్ళు ఒక నవల గా నాకు నచ్చడానికి కారణం , సినిమా వెనుకగల సినిమా చరిత్రను, రచయిత కథాత్మకంగా చిత్రించడమే కాదు; జరిగిన, జరుగుతున్న, జరగడానికి అవకాశాలున్నవేలాది సంఘటనలను మనోజ్ఞంగా తన రచనలో ఫొశించడం కూడా కాదు; వీటన్నింటినిమించి, వీటన్నిటివెనుక ఆ రచయిత పదుతున్న మనోవేదన, వాటిని మార్చి తీరలన్న అతని ప్రగాఢ వాంఛ నన్ను కదిలించింది. "
ఈనవలలో ఒకచోట మిత్రులు తమ నాటక సమాజాన్ని మూసివేసి, వారుపడుతున్న ఆవేదనను రచయిత ఈ విధంగా వర్ణిస్తాడు--- ప్రాచీన నాటక పద్ధతికి, ఆధునిక విధానానికి మద్య వంతెనెలాగా మా సమాజం పని చేసింది. ఇప్పుడు దాని అవసరం లేదు. ఇక ముందు కూడా రాదు. ఇప్పుడు దీనికున్న స్థానం, ఒక జ్ఞాపకానికున్న స్థానం కన్నా పెద్దదేమి కాదు. ఈ వంతెన మీదుగా దాటి పోయిన ప్రయాణీకులకు, బహుశా దీని విషయం జ్ఞాపకం ఉండకపోవచ్చు కూడాను. దీని ఉనికి ఈ రోజు కేవలం నిష్ప్రయోజనం.
ఎంత అద్భుతంగా సున్నితంగా చెప్పారు.
ఇలాంటివి ఈ నవలలో ఎన్నో ఉన్నాయి. దీనిని ప్రతి ఒక్కరు చదవాలి చదివి తీరాలి

3 కామెంట్‌లు:

  1. రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశారు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టారు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే రాసిన 'పాలపుంత' అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా రాశారు. మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రికలో ధారావాహికగా వెలువడిన పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం.

    రిప్లయితొలగించండి
  2. శ్రీనివాసు గారూ !
    బ్లాగరి గా మీ తొలి ప్రయత్నం.....బాగుంది ! మధ్యలో ఆ ఆంగ్ల విషయాన్ని తొలగించండి ! సెలెక్టు చెసి డిలీటు చేయండి .అలాగే కామెంట్లలో మీ ప్రతి స్పందనే వుండాలి. కొత్త ' టెంప్లేట్లు ' కావాలంటే ఇక్కడ నుంది దింపుకోండి !


    http://www.deluxetemplates.net/

    అలాగే తెలుగు బ్లాగరుల గుంపులో సభ్యులు కండి !

    telugublog@googlegroups.com

    రిప్లయితొలగించండి
  3. శ్రీనివాస్ గారు,
    పాకుడురాళ్ళు వంటి ఓ మంచి నవలని పరిచయం చేసినందుకు ధన్యవాదములు.
    ఓ గొప్ప ప్రయత్నం.
    @ రమణ మూర్తి గారు;
    చాల థాంక్సండి బ్లాగర్ల గుంపులో జాయిన్ అవడాన్కి లింక్ పోస్ట్ చేసినందుకు.
    మన ఆంధ్రప్రదేశ్ లో వున్న తెలుగు కార్టూనిస్ట్ ల వివరాలు మరియు వల్ల కార్టూన్లను
    చూసేందుకు దయచేసి http://www.telugucartoon.com ని సందర్శించగలరు.

    రిప్లయితొలగించండి