7, నవంబర్ 2011, సోమవారం

చేతన్ భగత్ మరో నవల ; Revolution 2020

మరో మారు తన Confort జోను ఐన IIT/IIM చట్రంలో రాసిన నవలే Revolution 2020. తను ప్రేమించిన అమ్మాయి మరొక్కరికి దగ్గరైతే ఆ వ్యక్తి లొ రగిలే విరుద్దమైన భావాలను రచయిత చక్కగా చేప్పాడు. ఇక పాత్రల విషయానికి వస్తే ... గోపాల్ కారెక్టర్ ని తనదైన శైలిలో నడిపించినప్పటికి గోపాల్ జీవితం లో ఎదిగిన తీరు మాత్రం మన తెలుగు సినిమాలలో హీరో పాత్రలను మరిపిస్తుంది. రాఘవ పాత్ర నిజ జివితానికి దగ్గరగా ఉంది. ఒక అమ్మయి పాత్ర కావాలి కాబట్టి ఆర్తీ కారెక్టర్ను ఇరికించి నట్లుగా ఉంది. నేటి విద్యా విధానంలో, పోటీ ప్రపంచంలో విద్యార్ధులు పడుతున్న మానషిక క్షోభను/వత్తిడిని గురించి మరియు విద్యా విధానంలో ప్రైవేటు ఇనిస్టిట్యుట్స్ లో జరుగుతున్న రాజకీయాలను , అవినీతిని గురించి చెప్పిన విధానం బావుంది. ఎందుకో ఈ నవలలో చేతన్ భగత్ తన స్వ విషయాలను అంతగా రాసినట్లు లేదు. కామిడి మోతాదు కుడా కొంచెం తగ్గినట్లనిపిస్తుంది. రచనా శైలిలో రచయిత ఎక్కడ కూడా పాఠకులను నిరుత్సహపరచడు. its no way a bad book. Emphasizing the need for sacrifice and the revolution the novel is certainly Bollywood material.If you are in the mood for some full blown story telling, this one will surely not disappoint.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి