7, నవంబర్ 2011, సోమవారం

చేతన్ భగత్ మరో నవల ; Revolution 2020

మరో మారు తన Confort జోను ఐన IIT/IIM చట్రంలో రాసిన నవలే Revolution 2020. తను ప్రేమించిన అమ్మాయి మరొక్కరికి దగ్గరైతే ఆ వ్యక్తి లొ రగిలే విరుద్దమైన భావాలను రచయిత చక్కగా చేప్పాడు. ఇక పాత్రల విషయానికి వస్తే ... గోపాల్ కారెక్టర్ ని తనదైన శైలిలో నడిపించినప్పటికి గోపాల్ జీవితం లో ఎదిగిన తీరు మాత్రం మన తెలుగు సినిమాలలో హీరో పాత్రలను మరిపిస్తుంది. రాఘవ పాత్ర నిజ జివితానికి దగ్గరగా ఉంది. ఒక అమ్మయి పాత్ర కావాలి కాబట్టి ఆర్తీ కారెక్టర్ను ఇరికించి నట్లుగా ఉంది. నేటి విద్యా విధానంలో, పోటీ ప్రపంచంలో విద్యార్ధులు పడుతున్న మానషిక క్షోభను/వత్తిడిని గురించి మరియు విద్యా విధానంలో ప్రైవేటు ఇనిస్టిట్యుట్స్ లో జరుగుతున్న రాజకీయాలను , అవినీతిని గురించి చెప్పిన విధానం బావుంది. ఎందుకో ఈ నవలలో చేతన్ భగత్ తన స్వ విషయాలను అంతగా రాసినట్లు లేదు. కామిడి మోతాదు కుడా కొంచెం తగ్గినట్లనిపిస్తుంది. రచనా శైలిలో రచయిత ఎక్కడ కూడా పాఠకులను నిరుత్సహపరచడు. its no way a bad book. Emphasizing the need for sacrifice and the revolution the novel is certainly Bollywood material.If you are in the mood for some full blown story telling, this one will surely not disappoint.

2, జులై 2011, శనివారం

2 States : The Story of My Marriage



ఈ క్రింది విధంగా నవల ప్రారంభం అవుతుంది
Love marriages around the world are simple:
Boy loves girl. Girl loves boy. They get married.

In India, there are a few more steps:

Boy loves Girl. Girl loves Boy.
Girl's family has to love boy. Boy's family has to love girl.
Girl's Family has to love Boy's Family. Boy's family has to love girl's family.

Girl and Boy still love each other. They get married.

2009 లో పబ్లిష్ ఐన చేతన్ భగత్ నవల ఇది. రెండు విబిన్నమైన సంస్కృతల నుంచి వచ్చిన యువతీ యువకుడు ప్రేమించుకొని ఎలా ఒకటైనారో , ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో రచయిత చాల చక్కగా వివరించాడు.
ఈ నవల కథకు స్పూర్తి వారి జీవితనుభవమేనట . ఎందుకటే రచయిత ది డిల్లి ఐతే ఆయన శ్రీ మతి అనుష ది తమిళనాడు అట.
ఒక సారి చదవటం మొదలుపెడ్తే పూర్తయ్యేంత వరకు ఆపలేక పోతున్నామంటే రచయిత శైలి ఎంత గొప్పదో ఆలోచించండి. ఈ నవల ఆద్యంతం హాస్యభరితంగా ఉంటుంది. ఇది తప్పక చదవ వలసిన నవలలలో ఒకటిగా చెప్పక తప్పదు.

11, జూన్ 2010, శుక్రవారం

రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ గారి పాకుడు రాళ్ళు

నేను ఈ నవలను 1991 లో మొదటి సారి చదివాను. ఆ తర్వత కనీసం మరో పదిమార్లు చదివాను. ఎన్నిసార్లు చదివినా, చదివిన ప్రతి సారి కొత్తగా అన్పిస్తుంది.
ఈ నవల కృష్ణా పత్రికలో వచ్చిందట. ఆ తరువాత 1990 లో వేయి కాఫిలతో ప్రధమంగా ముద్రింపబడింది.
తొలి ముద్రణకు ఆలపాటి వెంకట్రామయ్య గారు పీఠిక అద్భుతంగా వ్రాశారు.
వారి మాటలలో
" పాకుడు రాళ్ళు ఒక నవల గా నాకు నచ్చడానికి కారణం , సినిమా వెనుకగల సినిమా చరిత్రను, రచయిత కథాత్మకంగా చిత్రించడమే కాదు; జరిగిన, జరుగుతున్న, జరగడానికి అవకాశాలున్నవేలాది సంఘటనలను మనోజ్ఞంగా తన రచనలో ఫొశించడం కూడా కాదు; వీటన్నింటినిమించి, వీటన్నిటివెనుక ఆ రచయిత పదుతున్న మనోవేదన, వాటిని మార్చి తీరలన్న అతని ప్రగాఢ వాంఛ నన్ను కదిలించింది. "
ఈనవలలో ఒకచోట మిత్రులు తమ నాటక సమాజాన్ని మూసివేసి, వారుపడుతున్న ఆవేదనను రచయిత ఈ విధంగా వర్ణిస్తాడు--- ప్రాచీన నాటక పద్ధతికి, ఆధునిక విధానానికి మద్య వంతెనెలాగా మా సమాజం పని చేసింది. ఇప్పుడు దాని అవసరం లేదు. ఇక ముందు కూడా రాదు. ఇప్పుడు దీనికున్న స్థానం, ఒక జ్ఞాపకానికున్న స్థానం కన్నా పెద్దదేమి కాదు. ఈ వంతెన మీదుగా దాటి పోయిన ప్రయాణీకులకు, బహుశా దీని విషయం జ్ఞాపకం ఉండకపోవచ్చు కూడాను. దీని ఉనికి ఈ రోజు కేవలం నిష్ప్రయోజనం.
ఎంత అద్భుతంగా సున్నితంగా చెప్పారు.
ఇలాంటివి ఈ నవలలో ఎన్నో ఉన్నాయి. దీనిని ప్రతి ఒక్కరు చదవాలి చదివి తీరాలి
నేను చదివిన తెలుగు నవలలో నాకు చాలా బాగా నచ్చిన నవలల గురించి సమిక్షించాలనే ఊద్ధేశ్యంతో ఈ బ్లాగును ప్రారంభించాను. దయచేసి దీనిలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి
నేను చదివిన తెలుగు నవలలో నాకు చాలా బాగా నచ్చిన నవలల గురించి సమిక్షించాలనే ఊద్ధేశ్యంతో ఈ బ్లాగును ప్రారంభించాను. దయచేసి దీనిలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి